
సిగ్నల్ పనిచేయక రోజుల తరబడి కార్యాలయం చుట్టు తిరుగుతున్న రైతులు
12:00 అయినా కార్యాలయానికి రాని వ్యవసాయ అధికారులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏఓ కిరణ్ కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి
జనం న్యూస్ 29డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన సమస్య పరిష్కారం కాక రైతులు నానా తంటాలు పడుతున్నారు, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొరకు కపాస్ కిషన్ యాప్ లో ఆన్లైన్ చేద్దామంటే సిగ్నల్స్ పనిచేయడం లేదు, వ్యవసాయ కార్యాలయం ఉదయం పూట వచ్చిన అధికారులు సమయపాలన పాటించకుండా కార్యాలయానికి రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయ జిల్లా శాఖ అధికారి కూడా దీన్ని చూసి చూడనట్టుగా వివరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడుతుంది, ఆన్లైన్ చేసిన పది రోజులు అయిన కూడా పత్తి సిసిఐ తీసుకోవడం లేదు, ఆన్లైన్ కాకపోవడంతో ఇక్కడికక్కడ రైతుల పట్టి ఇండ్లలో నిల్వ ఉంటుంది, దాని ద్వారా పత్తి పాడవుతుంది, రైతులు నష్టపోతున్నారు కావున వెంటనే స్పందించాలని రైతుల సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏవో కిరణ్ గారికి వినతిపత్రం డివైఎఫ్ఐ గా అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్ గొడిసెల కార్తీక్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.