
జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన గుత్తులసాయి, గంధం పల్లంరాజు తదితరులు సోమవారం అమరావతిలోని సీఎం కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.**ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేతలు ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలపై, జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.*