
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాల స్వామి ఆలయం ముక్కోటి వైకుంఠపర్వదినాన్నిపురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఆధ్యాత్మిక శోభతోఆలయంముక్కోటిఏకాదశినిపురస్కరించుకుని ఆలయ ఈఓ ఈద్గుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర్ పర్యవేక్షణలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారినిదర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ అర్చకులు కారంపూడి రమణచార్యులు, కారంపూడి సాయి మోహన్ స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.ముక్కోటి ఏకాదశి ఉభయ దాతలుగా జవ్వాజి విజయ భాస్కర రావు, వారి ధర్మపత్ని శేషుకుమారి, కుమారుడుజవ్వాజిసాయికృష్ణవ్యవహరించారు. స్వామివారి సేవలో భాగంగావీరుప్రత్యేకకార్యక్రమాలను నిర్వహించారు.భక్తులకు ప్రసాద వితరణవిచ్చేసిన వందలాది మంది భక్తులకు లడ్డు ప్రసాదాన్ని పోలేపల్లి జనార్దన్, వారి ధర్మపత్ని లక్ష్మి పంపిణీ చేశారు. దర్శనం అనంతరం భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే అల్పాహార ఏర్పాట్లు చేశారు అల్పాహారం మరియు ధనుర్మాశం నెలరోజులు స్వామివారికి అలంకరణ పూల దాతలు క్రి శే గోపు వెంకటయ్య జ్ఞాపకార్ధం విరి ధర్మపత్ని శ్రీదేవి కుమారులు గోపు వెంకటేష్,గంగాధర్,వారువ్యవహరించారు కెవి ఆర్ హెల్త్ క్లినిక్ వారు అల్పాహారం ఎర్పాటు చేశారు,స్వామి వారికీ దేవతా వస్త్రములుసమర్పించినవారు క్రీశే గాధంశెట్టిసుబ్బరామయ్య సహోదరులు గాధంశెట్టి సుబ్బరత్నం వీరి సతీమణి కృష్ణకుమారి సమర్పించారు స్వామి వారు మాడవిధుల్లో విహారిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాల స్వామివారినిసేవించిపునీతులయ్యారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు