
జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్య ప్రత్యేక పూజలు చేసినారు అర్చకులు మాట్లాడుతూ నెలకు రెండు చొప్పున ఒక సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయని అందులో అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి లతో సమానమని అందుకోసమే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గురు స్వామి సామల బిక్షపతి చిందం రవి వినుకొండ శంకరాచారి సామల శంకర్ స్వాములు కందగట్ల రమేష్ సామల నాగరాజు వనం విశాల్ నామని శివ కొత్తపెళ్లి రవీందర్ బాలకృష్ణ మామిడి రాజు మార్త సుమన్ గట్టు కిషన్ సురేష్ గన్ను వేణు కాంబత్తుల ప్రకాష్ బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..