
జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఇరుకుల్ల మంగను, ఆత్మ (ATMA) కమిటీ చైర్మన్‌గా సత్తన్నను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, వారు మంగళవారం ఆసిఫాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇరుకుల్ల మంగ, సత్తన్నలతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జక్కన్నను సుగుణక్క శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని న్యాయంగా నిలబెట్టుకొని, రైతుల సంక్షేమం కోసం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీలు సమర్థవంతంగా పని చేయాలని సుగుణక్క అన్నారు.కాంగ్రెస్ పార్టీ కృషి, సేవా దృక్పథానికి గుర్తింపుగా ఈ నియామకాలు వచ్చాయని పేర్కొన్న సుగుణక్క, కష్టపడి పని చేసే నాయకులకు తప్పకుండా పార్టీలో గౌరవం, బాధ్యతలు లభిస్తాయని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం, మార్కెట్ సదుపాయాల మెరుగుదల, వ్యవసాయ అభివృద్ధికి ఈ కమిటీలు కీలకంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్
