
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 30/12/2025 మంగళవారం
అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఉదయం స్వామివారి అభిషేకము, హారతి మరియు ప్రత్యేకమైన పూజలతో విశిష్టమైన అలంకరణతో స్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారా దర్శనమిచ్చారు. తదుపరి స్వామి వారి కళ్యాణం కనుల విందుగా జరిగినది, తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాఘవేంద్ర మాట్లాడుతూ సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా మరియు ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారని, ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని, పూజలు, దానధర్మాల వలన అనేక జన్మల పుణ్యం లభిస్తుందని, ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరవబడతాయని విశ్వాసం అందువల్ల వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారన్నారు