
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 30
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రహదారులపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం వద్దని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రజలంతా నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించి నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు.