
జుక్కల్ డిసెంబర్ 30 జనవరి న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని ఖండేబెల్లూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (ఉత్తర ద్వారం) లో ఈరోజు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు మరియు వారి సతీమణి శ్రీమతి శైలజ గారు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖండేబెల్లూరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ నాయకులు డీసీసీ చీఫ్ దంపతులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

