జనం న్యూస్ 06 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్)11-02-2025 మంగళవారం నాడు కొత్తగూడెం పట్టణం కేంద్రంలోని బీసీ భవనంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య సినిమా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆ తర్వాత మహనీయుల ర్యాలీ, 26 మంది సహనిర్మాతలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది కనుక జిల్లాలోని అన్ని కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు దొడ్డి కొమరయ్య తెలంగాణ సమాజం కోసం తన ప్రాణాన్ని అర్పించాడని అన్నారు. జిల్లా చైర్మన్ దూడల బుచ్చయ్య మాట్లాడుతూ తెలంగాణ సమాజం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు అలాంటి వారిని సమాజం ఎప్పుడు గుర్తుంచుకోవాలని అందులో భాగంగానే దొడ్డి కొమరయ్య పైన సబ్బండ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సినిమా తీస్తున్నాం అని ఆయన అన్నారు. దర్శకుడు ఎం. సేనాపతి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య సినిమాని వెయ్యి మంది సహ నిర్మాతలతో నిర్మిస్తున్నామని ప్రపంచ సినీ చరిత్రలో ఇదొక సంచలన సినిమాగా నిలవబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ జి సక్రు, ఇల్లందు నియోజకవర్గ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ కరెంటు శ్రీనివాస్ యాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ కో చైర్మన్ బండి రాజు గౌడ్, కో కన్వీనర్ కురిమెళ్ళ శంకర్, జిల్లా ప్రచార కార్యదర్శి భూపతి శ్రీనివాస్, దొడ్డి కొమరయ్య సినిమా సహనిర్మాతలు పొడిచేటి కొండలరావు, బి.సుధాకర్, బాల్ దే కేశవులు, శనగపురం రామకృష్ణ, పితాని సత్యనారాయణ, ఎం.బిక్షపతి, విజయలక్ష్మి, కుల సంఘాల నాయకులైన సేవాలాల్ నాయకులు కాశీరాం, ఎం. రాఘవచారి, కేసరి నాగేశ్వర్, కె నాగేశ్వరరావు, పి వీరయ్య, కె శ్రీనివాస్, ఇస్లావత్ శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.