
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) దౌల్తాబాద్, డిసెంబర్ 31:
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించకూడదని హెచ్చరించారు.తాగి వాహనాలు నడపడం, రోడ్లపై గందరగోళం సృష్టించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్సై అరుణ్ కుమార్, నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక గస్తీ మరియు తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.