
జనం న్యూస్ డిసెంబర్ 30 ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్చార్జిలకు అవార్డులు బహకరించారు. ఈరోజు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పాల్గొని ప్రతిభ కనపరిచిన నాయకులకు ప్రశంసా పత్రాలు బుచ్చిబాబు మరియు హరీష్ మాధుర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు క్లస్టర్, యూనిట్, బూత్,ఇన్చార్జులు ప్రజల దగ్గరికి వెళ్లి సంక్షేమ పథకాలన్నీ వివరిస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడునీ ముఖ్యమంత్రిని చేయడంలో ఇన్చార్జులు పార్టీకి తీవ్రంగా కృషి చేసారని అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్రంగా పార్టీకి కృషి చేశారని సపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో కూడా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజలకు వివరించి గ్రేడ్ పొందిన వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ప్రశంసా పత్రాలు బుచ్చిబాబు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తూ మెడికల్ కాలేజీ ల మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టే వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని రాబోయే మూడున్నర సంవత్సరాలలో యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం గా పని చేస్తున్నారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తిరిగి 2029లో ఈ కూటమి ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు.విశాఖ గ్లోబల్ సమ్మెట్ 610 ఒప్పందాలు చేసుకుని 13.25 లక్షలు పెట్టుబడులు తీసుకొని వచ్చి 16.13 లక్షలు ఉద్యోగాలకు కృషిచేస్తున్నారని అన్నారు. హరీష్ మాధుర్ మాట్లాడుతూ కోనసీమ కొబ్బరి రైతులను ఆడుకోవటానికి కొబ్బరి పరిశ్రమ తీసుకు రావటానికి కృషి చేస్తున్నానని అన్నారు .ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, నాగిడి నాగేశ్వరరావు, చెల్లి అశోక్, గొలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, సాగిరాజు సూరిబాబు రాజు, దొమ్మేటి రమణ కుమార్,కట్ట సత్తిబాబు,సాగిరాజు సూరిబాబు రాజు,తాడి జానకిరామ్, దూళిపూడి బాబీ, మొపూరి వెంకటేశ్వరరావు,కాకర్లపూడి రాజేష్, చెల్లి సురేష్,వెంట్రు సుధీర్,ఆకాశం శ్రీను, ములపర్తి బాలకృష్ణ, టేకుమూడి లక్ష్మణరావు, చిక్కాల అంజిబాబు,కడలి నాగు, గొల్లపల్లి గోపి,దంగేటి శ్రీనివాస్,అడబల సతీష్, యాళ్ల ఉదయ్,నిమ్మకాయల విస్సు,నడిమింటి ప్రభాకరం, పిల్లి నాగరాజు, జాగు సత్తిబాబు, గీసాల చంద్రరావు,మెండి కమల, బొక్క రుక్మిణి,కుడిపూడి మల్లేశ్వరి, ముమ్మిడివరపు వరలక్ష్మి, కట్టా త్రిమూర్తులు,మాదాల బుజ్జి,మాదాల కుమార్, పాయసం చిన్ని, నీటిపూడి వంశీ, దివి విజయ్,సబ్బతి డేవిడ్ రాజు,రేఖడి రాంబాబు, గోదాసి గణేష్, గుద్దటి వీరాస్వామి నాయుడు, శివ రాజు,మొదలగు వారు పాల్గొన్నారు
