
న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు…!
కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్
జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ ఆదివారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్, రాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దన్నారు. మండల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులు, యువతకు ఆయన సూచించారు.