
జనం న్యూస్: డిసెంబర్ 31 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.)
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక, అనుచిత, అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. నూతన సంవత్సర సంబరాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జగరకుండా పోలీస్ అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనుటకు కేక్ కట్టింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే సంగీతం,రోడ్డు కూడళ్ళలో గుమిగూడటం, బహిరంగంగా పార్టీలు, నృత్యాలు తదితర నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశములలో నిర్వహించరాదు. పెద్ద పెద్ద ధ్వనులతో లోడ్ స్పీకర్లు/డీజే లు పెట్టి ప్రజాశాంతికి, ప్రజా క్రమానికి భంగం కల్గించరాదు.అలా చేసిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకొనబడును.