
బిచ్కుంద డిసెంబర్ 31 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బుధవారం రోజున బిచ్కుంద బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే ఆధ్వర్యంలో మున్సిపాలిటీ బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ— రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకమని, ప్రతి వార్డు లో బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు.కేసీఆర్ గారి నాయకత్వంలో గత పాలనలో బిచ్కుంద ప్రాంతానికి జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లి, బి ఆర్ఎస్ పార్టీనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేయాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లోనుకాకుండా
పార్టీ శ్రేణులు ఐక్యంగా, క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేస్తే బిచ్కుంద మున్సిపాలిటీపై మళ్లీ బి ఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు, మున్సిపాలిటీ స్థాయి నేతలు,వార్డు ఇన్చార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

