
జనం న్యూస్,తేదీ.31-12-2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.
రిపోర్టర్ బాలాజీ
బిఆర్ఎస్ నాయకులు భూక్య చందు నాయక్ సతీమణి కవిత ఇటీవల అనారోగ్యంతో ఖమ్మం హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం పాల్వంచలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెను మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వయంగా నివాసానికి వెళ్లి పరామర్శించారు.కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా పరామర్శించి, ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ బిఆర్ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్ బిఆర్ఎస్ మహిళా నాయకురాలు సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నేతలు కవిత త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
