
జుక్కల్ డిసెంబర్ 31 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ప్రసిద్ధ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు ఈరోజు దర్శించుకున్నారు. డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆలయాన్ని సందర్శించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏలే మల్లికార్జున్ గారు,
జిల్లా ప్రజల శ్రేయస్సు,రాష్ట్ర అభివృద్ధి,కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు.
మండల కేంద్రంలో ఘన స్వాగతం – నాయకులతో కలిసి ఆలయానికి ర్యాలీలా పయనం
అంతకుముందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, లింగాయత్ సమాజ్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉపసర్పంచులు మండల కేంద్రంలో పెద్ద సంఖ్యలో హాజరై
డీసీసీ చీఫ్‌కు ఘనమైన స్వాగతం పలికారు.పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించిన అనంతరం, వారందరితో కలిసి ఆలయానికి వెళ్లి సమూహ దర్శనం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనగా,డీసీసీ అధ్యక్షుల తొలి దర్శనం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది.

