
జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన
కాట్రేనికోన ఎంపీడీవో గా పనిచేసిన ఎస్వి చలం సేవలు అజరామరమని మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు పేర్కొన్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ఎస్వి చలవను బుధవారం ఘనంగా సన్మానించారు. కాట్రేనికోనలోని గ్రంధి నాగేశ్వరావు కళ్యాణ మండపంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎవరిని నొప్పించకుండా సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందారని నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, జడ్పిటిసి నేల కిషోర్ కుమార్, గంటి వెంకట సుధాకర్, ఎం బాబ్జి, నడింపల్లి సుబ్బరాజు, మండల టిడిపి యువత అధ్యక్షుడు వంగ దుర్గ బాబు, పెసంగి రంగారావు వర్మ, త్స వటపల్లి శ్రీనివాస్, గంగుమళ్ల రవి, మట్ట రమేష్, చికురుమిల్లి చక్రధర్, కాండ్రేగుల సత్య ప్రసాద్, కముజు రాంబాబు, నేలపాటి సంచలరావు, కోటిపల్లి సత్యనారాయణ, నల్లా నరసింహమూర్తి, సుంకర బుజ్జి, గోకరకొండ సత్యనారాయణ మూర్తి,దొమ్మేటి పల్లవి, డి సీతారామకృష్ణంరాజు, నాతి అలివేణి, కుంచె రాజు, మోకా అప్పాజీ,తదితరులు పాల్గొన్నారు.