
జనం న్యూస్; డిసెంబర్ 31 బుధవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమము లో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు,ఉపాధ్యాయులకు, తలిదండ్రులకు మరియు సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర కేక్ ని కట్ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రములో కరస్పాండెంట్ లిఖిత ,ఉపాధ్యాయులు వాణిశ్రీ,రత్నమాల,దేవిక,కావేరి, భరతమాత, ఫిర్దూజ్,సారిక,మానుష తదితరులు పాల్గొన్నారు.