
జనం న్యూస్ ; 31 డిసెంబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
సిద్దిపేట జిల్లాకు చెందిన కవి కాల్వ రాజయ్య రచించిన రాచబాట శతకం పుస్తకావిష్కరణ జనవరి నాలుగు ఆదివారం ఉదయం పదిగంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కలదని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. రాచబాట శతకం పుస్తకావిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి విశిష్ట అతిథిగా యువ అవధాని అవుసుల భాను ప్రకాష్ అతిథులుగా ఐతా చంద్రయ్య, గరిపల్లి అశోక్, మామిండ్ల ఐలయ్య యాదవ్, సంటి గంగారాం, ఎన్నవెళ్లి రాజమౌళి, కొండి మల్లారెడ్డి, సింగీతం నరసింహారావు, పొన్నాల బాలయ్య, సరస్వతీ రామశర్మ, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, మహేంద్రారెడ్డి, లక్ష్మయ్య, మల్లికార్జున్ యాదవ్, అనిల్ యాదవ్ తదితరులు హాజరవుతారని, ఇట్టి కార్యక్రమంలో కవులు రచయితలు సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆ కార్యక్రమ సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పుస్తక రచయిత కాల్వ రాజయ్య, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.