
బిచ్కుంద డిసెంబర్ 31 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం మార్కెట్ నందు ఒక సంవత్సరం వయసుగల సంధ్యారాణి అనే పాప తప్పిపోయి మార్కెట్లో తన తల్లిదండ్రుల కోసం తిరుగుతున్నదని మార్కెట్ కు వచ్చిన బిచ్కుంద వాసులు బిచ్కుంద ఎస్ఐ గారికి తెలుపగా బిచ్కుంద ఎస్ఐ గారు మరియు తమ సిబ్బంది అందరూ కలిసి తమ తల్లిదండ్రుల కోసం బిచ్కుంద మార్కెట్ నందు వెతికి పాప తల్లిదండ్రులకు అప్పగించడం అయినది పాప తల్లి వివరాలు తెలుసుకోగా చాకలి లక్ష్మి భర్త రాములు గ్రామం మాందాబాద్ జుక్కల్ మండలం వాసు అని తెలిసినది