
జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తెలంగాణ రాష్ట్రంలోని 28 జిల్లాల యూత్ ప్రెసిడెంట్లను జనరల్ సెక్రటరీలను నియమించడం జరిగింది దానిలో భాగంగా హనుమకొండ జిల్లాకు జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామ నుండి తీన్మార్ జయ్ నీ నియమించడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా తీన్మార్ మల్లన్న టీంలో శాయంపేట మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి చాలా విధాలుగా సేవా కార్యక్రమాలు అందించిన తీన్మార్ జయ్ నీ తన కష్టాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తించి హనుమకొండ జిల్లాకు జిల్లా యూత్ అధ్యక్షునిగా నియమించడం చాలా సంతోషకరమైన తన ఆనందభవాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ హోదా కల్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న కి మాదం రజని కుమార్ కి భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కి వట్టే జానయ్య కి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్ కి హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చిన హోదాను 100 రెట్ల ఉత్సాహంతో పని చేస్తూ పార్టీని ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకెళ్తూ ప్రజల కష్టసుఖాల్లో ముందుఉండి పరిష్కారంచేస్తూ ఎల్లవేళలా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని తీన్మార్ జయ్ తెలియజేశారు…..