
జనం న్యూస్ 2డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్ :-అడవి బిడ్డల జీవనస్థితిగతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధార పోసి ఆదివాసి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహామనిషి ప్రొఫెసర్ హైమన్ డార్ప్-బెట్టి ఏలిజబెత్ దంపతులు అని కోనియడారు. మార్కెట్ కమిటీ ఆవరణంలో గురువారం మార్కేట్ కమిటి చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, మాజీ గ్రంథాలయసంస్థ చైర్మన్ కనక యాధవరావు, జైనూర్ సర్పంచ్, కోడప ప్రకాష్,మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభతో పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హైమాన్ డార్ప్, ఏలిజబెత్ దంపతుల
అట్టి కరపత్రలను పోస్టర్లను విడుదల చేశారు,ఈ నెల 11,ఆదివారం రోజున ఇట్టి కార్యక్రమం జరుగుతుందని ఆదివాసీలు, అభిమానులు వర్దంతి సభకు భారిగా తరలిరావలని వారు కోరారు.ఈ సందర్బంగా వారు మాట్లడుతూ… నైజం ప్రభుత్వ నిరంకుశ పాలనపైన ఆదివాసీలు నాడు తిరుగుబాటుకు పూనుకున్నారు, నాటిబ్రిటిషు పాలకులు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నా సందర్బంలో ప్రభుత్వనికి వ్యతిరేఖంగా, ఆదివాసీల పోరాటలు కోనసాగుతున్నా తరుణంలో అప్పటి నైజం నావాబు ప్రభుత్వం ఆదివాసీల స్థితిగతులను, జీవన మనుగడ గురించి పరిశోధనకు హైమాన్ డార్ప్ దంపుతులను మార్లవాయి ప్రాంతనికి పంపించడం జరిగినది,ఆదివాసీల తిరుగుబటుకు, కారణలను తెలుసుకోని అప్పటీ ప్రభుత్వనికి నివేదికలను అందించిన మహోన్నతమైన మహమనిషి,హైమాన్ డార్ప్, అని కోనియాడారు,ఆదివాసీలలో తాను మమెకమై,ఆదివాసీలను చైతన్యవంతమైన జీవన విధానం వైపు ప్రయాత్నించిన, హైమండార్ప్ ను నేటికి ఆదివాసీలు తమ వాడిగానే చూస్తూ, మరణం అనంతరం కూడ, ఆయన వర్దంతిని ఆదివాసీలు ఇప్పటికి ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి ప్రతి యోటా ఆదివాసీలు భారీగా తరలి వస్తారు.
నూతన సంవత్సరం సందర్బంగా మార్కేట్ కమిటి కార్యాలయం నందు మార్కేట్ చైర్మన్, కుడ్మెత్ విశ్వనాథ్ కు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావుకు, పలు గ్రామ పంచాయితీల సర్పంచ్ లు,ఆదివాసీ సంఘాల నాయకులు నూతన సంవత్సరం శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కనక ప్రతిభ మార్లవాయి సర్పంచ్ ప్రజాప్రతి నిధులకు శాలువలు కప్పి శుభకాంక్షలు తెలియపరిచి, మార్లవాయిలో హైమండార్ప్ వర్దంతి కి రావాలని ఆమె అందరిని ఆహ్వనించారు.ఈ కార్యక్రమంలో సర్మెడి మెస్రం భాదిరావు, కాంగ్రేష్ పార్టీ మండల అధ్యక్షులు ముఖిద్, మాజీ వైస్ ప్రసిడేంట్ చీర్లే లక్ష్మన్, మెస్రం అంబాజీ,ఆత్మ చైర్మన్ రామెష్,మార్కేట్ కమిటి డైరక్టర్ లు కనక గంగారం, మండాడి లింగు పంద్ర శేఖు, నాయకులు, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు కుమ్రం శంకర్,మెస్రం శ్రీకాంత్ కేంద్రే విషల్
మాజీ సర్పంచ్ కుమ్రం శ్యాంరావు, మాజీ సర్పంచ్ మడవి భీంరావు, సర్పంచ్ మడవి లక్ష్మన్, తోడసం రాజు,తదితరులు ఉన్నారు.🌱🙏
