
స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేట లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలను ప్రిన్స్ పాల్ డా.టి.కె.వి.శ్రీనువాసు ప్రారంభించారు.ఈ పోటీలలో వాలీబాల్ మెన్స్, ఉమెన్ కబడ్డీ, రన్నింగ్ మెన్ అండ్ ఉమెన్, షార్ట్ పుట్ ఆటలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలకు జిల్లాలో ఉన్నటువంటి వివిధ కళాశాలల నుండి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. అనంతరం వారికి బహుమతి ప్రధానం కార్యక్రమం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎ.ఆనందరావు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథులుగా మండపేట పురపాలక సంఘం ఛైర్పర్సన్ శ్రీమతి పతివాడ నూకదుర్గారాణి, రాష్ట్ర చైల్డ్ లేబర్ కార్పోరేషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు హాజరై గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్స్ , మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంను చక్కగా నిర్వహించిన వ్యాయామ అధ్యాపకులు సిహెచ్ చంద్రశేఖర్ ను మరియు ఇతర కళాశాల నుంచి విచ్చేసిన వ్యాయామ అధ్యాపకులు అరుణ కిషోర్, కనకరాజు, యువరాజులను కళాశాల సిబ్బంది మరియు మేరా యువ భారత్ సిబ్బంది సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ భారత్ వాలంటీర్లు కె.ఈశ్వర్ గౌడ్ ,సరోజినీ , కళాశాల అధ్యాపకులు,అధ్యపకేతర సిబ్బంది, జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు హాజరయ్యారు.