జనంన్యూస్. 05.
నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల.తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల లో సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అరవింద్. జాతీయ నులి పురుగుల నివారణ మరియు కుష్ఠు వ్యాధి పై విద్యార్థులకు అవగాహన సదస్సు ను నిర్వహించారు ,ఈ సదస్సులో చర్మం పైన నొప్పి లేని గోధుమ లేదా తెలుపు మచ్చలు ఉంటె అది కుష్టు వ్యాధి కావచ్చు అని ,అలా ఉన్నవారు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సంప్రదించాలని సూచించారు ,ఆలాగే పిల్లలందరితో కుష్టు వ్యాధి నివారణ ప్రతిజ్ఞను చేయించారు ,ఫిబ్రవరి 10 వ తేదీన జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఆ రోజు పిల్లందరికి ఆల్బండాజోల్ మాత్రలను పంపిణీ చేస్తామని ,అందరు పిల్లలు ఆ మాత్రలను భోజనం చేసిన తరువాత చప్పరించాలని సూచించారు ,ఈ కార్యక్రమం లో పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి.ఉపాధ్యాయ బృందం మరియు ఏఎన్ఎం స్వరూప ఆశ వర్కర్లు పాల్గొన్నారు ,