
జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
నూతన సంవత్సరం సందర్భంగా కె.పి హెచ్బి కాలోని ఐదవ ఫేస్ కుకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనశ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి జనసైనికులకు,వీర మహిళలకు , దేశ మరియు ఇరురాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీని నియోజకవర్గం తో పాటు తెలంగాణ రాష్ట్రలో కూడా పార్టీని బలోపేతం అయ్యేలా కృషి చేయాలని నాయకులని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, కలిగినీడీ ప్రసాద్, పులగం సుబ్బు, బండ్రెడ్డి గోపి, గుణశేఖర్, కొల్లా రవీంద్ర, నవీన్, మారుతి, జైరాం, సిద్దు మరియు వీరమహిళలు వెంకట్ లక్ష్మి,అనిత గాలి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.