
జనంన్యూస్ 02.సిరికొండ.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల న్యా వనంది లో ప్రొఫెసర్ ప్రసాద్ సార్ మరియు విశ్వతేజస్ మోటివేషన్ సంస్థ మోటివేటర్ అయిన నవీన్ తో విద్యార్థులకు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, పట్టుదల, సాధించాలని తపన, సమయపాలన, లక్ష్యంతో ముందు ఎదగాలని ప్రోత్సహించడం జరిగింది,
తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని కష్టపడి చదివి ఎదగాలని ప్రొఫెసర్ ప్రసాద్ సార్ సూచించారు,ఈ కార్య క్రమములో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి గారు, ఉపాధ్యాయులు రాజేశ్వర్,
ద యాల్ సింగ్ ,కిరణ్ కుమార్, గోపి, రాజపల్ , సుజాత , శారద,నవ్య తదితరులు పాల్గొన్నారు
