
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బాడంగి పోలీసు స్టేషనులో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన వాడాడ వెంకటరమణ (23) కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ జనవరి 2న తీర్పు వెల్లడించారని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.బాడంగి మండలం, రాజేరు గ్రామానికి చెందిన ఒక మైనరు బాలిక (14) కనపడుటలేదని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై బాడంగి పోలీసు స్టేషను ఎస్ఐ జె.తారకేశ్వరరావు 28.12.2024న మిస్సింగు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో వాడాడ గ్రామానికి చెందిన నిందితుడు వాడాడ వెంకటరమణ ఆ మైనరు బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కత్తిపూడి తీసుకొని వెళ్లి, అక్కడ ఆ బాలికను శారీరకంగా పలు మార్లు అనుభవించాడని తెలియడంతో పోక్సో చట్టం క్రింద కేసును ఆల్టర్ చేశారు. బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి కేసును దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు.నిందితుడు వాడాడ వెంకటరమణపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో పోలీసులు తరుపున పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.ఖజానారావు వాదనలు వినిపించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, సి.ఐ. కె.నారాయణరావు, ఎస్ఐ జె.తారకేశ్వరరావు, సి.ఎం.ఎస్. హెచ్.సి. సిహెచ్. రామకృష్ణ, కోర్టు హెడ్ కానిస్టేబులు బి.మహేష్, స్పెషల్ పిపి ఎం. ఖజానారావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.