
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.
స్థానికుల సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానాకి చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు.
మృతుడికి 50-55 ఏళ్లు ఉంటాయని, నీలిరంగు ఫుల్ హాండ్స్ షర్టు, బ్లాక్ కలర్ జీన్ ప్యాంటు ధరించాడన్నారు.
ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు తెలపాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవి అన్నారు. కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.