
జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం రోజున చండూర్ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మొదటి మహిళ ఉపాధ్యాయురాలైన సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఫొటో కు మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా మండల విద్యాధికారి విట్టల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.