
జనంన్యూస్. 03. నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్..
నిజాంబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మన మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మన బడుగు బలహీన వర్గాలైన అమ్మాయిలు మరియు స్త్రీలకు విద్య నేర్పించడం కోసం కష్టపడిన మరియు ఒడిదోడుకులను తట్టుకొని నిలబడిన తీరును యాద్ చేసుకోవడం జరిగింది, వారి ఆశయాల సాధన కోసం నిరంతరం పాటు పడతామని ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ నిజాంబాద్ జిల్లా కన్వీనర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, గంగస్థాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బెల్లీడిగే సత్యనారాయణ, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ దారం భూమన్న మరియు పెద్ద ఎత్తున బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.