
జనం న్యూస్,తేదీ.4-1-2026. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.
రిపోర్టర్ బాలాజీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బీజేపీ పార్టీ ఆరోపించింది.పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలపై బీజేపీ పార్టీ తరఫున అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ, గతంలో ఇచ్చిన ఫిర్యాదు పత్రాల ప్రతులను మున్సిపల్ కార్యాలయం గోడలకు అంటించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ—
పాల్వంచ పట్టణంలో ప్రధాన రహదారులకే పరిమితమై పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని, కానీ చాలా కాలనీల్లో డ్రైనేజీ శుభ్రం చేయకపోవడం, సీసీ రోడ్ల వెంబడి పెరిగిన మొక్కలు తొలగించకపోవడం, బ్లీచింగ్ చల్లకపోవడం, కుక్కలు & కోతుల పట్టివేత జరగకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయని తెలిపారు.అలాగే మిషన్ భగీరథ పనుల వల్ల పాడైన సీసీ రోడ్ల మరమ్మత్తులు చేయకపోవడం, రోజువారీ చెత్త సేకరణ లోపించడం, తాగునీటి సమస్య, వీధి లైట్ల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని అన్నారు.పాల్వంచ పట్టణం గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా విస్తరించిందని, ఇళ్ల సంఖ్య, కాలనీల సంఖ్య, జనాభా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగలేదని విమర్శించారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి, అన్ని కాలనీల్లో ఉన్న సమస్యలను వెంటనే 8 ,జలీల్,రాములు,వినయ్,రామినాయుడు,శేఖర్ లు పాల్గొన్నారు.
