
బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. బిజెపి బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మహిళలు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, బిచ్కుంద మండల జనరల్ సెక్రటరీలు జాదవ్ పండరి, పిరజీ, గంగరాజు, లక్ష్మణ్ చారి, గోపాల్ చారి, పస్కే ప్రకాష్, శ్రీకాంత్, మోహన్ దేశాయ్, పండరి, మారుతి, అంజయ్య, మల్లికార్జున్, మల్లు దేశాయ్, దన్నురు విట్టల్, దయానంద్, సంతోష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు*

