
జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన గ్రామానికి చెందిన విశ్రాంతఉ పాధ్యాయుడు ఎం సహస్ర కారం (85) శనివారం ఉదయం మరణింంచారు.అయన కు భార్య, కుమారుడు, కుమార్తె , ఉన్నారు. కాట్రేనికోన, కందికుప్ప హై స్కూల్ నందు ప్రధానోపాధ్యాయుని గా పనిచేసారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తన మన అన్న బేధం లేకుండా విధులు నిర్వహించారన్న పేరు ఉంది. బోటనీ, వృక్షశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. తన శరీరానికి అవసరమైన మందులు, ఇతర వస్తువులుతానే స్వయంగా తయారు చేసుకునేవారు. పలువురికి వైద్యం కూడా చేసేవారు. అయన మృతి కి సంతాప సూచికం గా స్థానిక సిద్ధార్ధ డిగ్రీ కళాశాల కు సెలవు ప్రకటించారు. అయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు