
జనం న్యూస్ జనవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామపంచాయతీ నూతన ఉప సర్పంచ్ తుడుం రాజు కి సీనియర్ జర్నలిస్ట్ కోల రాజేందర్ గౌడ్, ఆధ్వర్యంలో చిరు సత్కారం జ్ఞాపిక అందించేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ కోల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా నాయకుడు తుడుం రాజు కి హృదయ పూర్వక ఆర్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రజా సేవలో అంకిత భావంతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందడం చాలా గర్వకారణం అని నిజానికి నిస్వార్డ పరంగా పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే ప్రతి నాయకుడికి ఎన్నాళ్ళకైన విజయం వరిస్తుంది అనటానికి నిలువెత్తు నిదర్శనం మన ఉప సర్పంచ్ తుడుం రాజు నిజాయితీగా, నిబద్ధతతో వ్యక్తిగతంగా ప్రజల మనస్సును గెలుచుకున్న మహా నాయకుడు తుడుం రాజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కదిలించే వార్త రిపోర్టర్ అర్షం మధు, పోతుగంటి సాంబారాజు, పెండేల కిరణ్ తదితరులు పాల్గొన్నారు…..