
జనం న్యూస్ జనవరి 3 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ).
ఎల్కతుర్తి అన్నారు. శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఆమెకు ఎస్సై అక్కినే పెళ్లి ప్రవీణ్ కుమార్, పుష్పగుచ్చమిచ్చి, పోలీస్ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి తోపాటు, ఆవరణలో మొక్కను నాటారు. సిబ్బందితో మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా చెప్పమన్నారు. ఆమె మాట్లాడుతూ, నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తూనే, ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలని సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహించినందుకు, సిఐ పులి రమేష్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది నీ అభినందించారు.
