
జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, రాబోయే అయిజ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశం బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు తపాలా రామాంజనేయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తపాలా రామాంజనేయులు మాట్లాడుతూ,అయిజ మున్సిపాలిటీలో నిర్వహించిన ఈ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లాలోనే మొదటి సమావేశం కావడం గర్వకారణం అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదే అని స్పష్టం చేశారు.
ప్రస్తుత పాలకులు, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలను మరిచిపోయారని తీవ్ర విమర్శలు చేశారు.వారి పాలన ప్రజల కోసం కాకుండా, అధికారులను సంతృప్తిపరచడానికే పరిమితమైందని, ప్రజల మౌలిక సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదన్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన,అయిజలో డిగ్రీ కళాశాల ఏర్పాటు విద్యార్థులకు వసతి గృహాలు అయిజ–కర్నూలు మధ్య శిథిలావస్థలో ఉన్న వంతెన స్థానంలో నూతన వంతెన తుపత్రాల–మేడికొండ అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతులు ఇవన్నీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు.పాలకులు మారినా పాలన విధానం మారలేదని, వారి నిర్లక్ష్యంతో అయిజ మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలు ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని* కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అనంతరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకువచ్చి అయిజ మున్సిపాలిటీ రూపురేఖలు మార్చే అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు.అయిజ అభివృద్ధి అంటే ఏమిటో బీజేపీ చేతల్లో చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అయిజ మున్సిపాలిటీలో బీజేపీ చేయబోయే ముఖ్య పనులు: శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల అభివృద్ధి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు స్ట్రీట్ లైట్స్, పారిశుధ్య మెరుగుదల మహిళలు, యువత, రైతుల కోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడం భారతీయ జనతా పార్టీ బాధ్యత వహిస్తుందని అన్నారు.ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎగ్బోటే,ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదన్న,అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బెల్లంకొండ నాగరాజు, ఖుషి, అంజి, రవి గౌడ్, వీరేష్ గౌడ్, మాధవాచారి, తెలుగు కృష్ణ, ప్రదీప్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.