
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ జనవరి 04 :
ఏన్కూర్ మండలం తూతక్కలింగన్నపేట గ్రామపంచాయతీలో జనసేన పార్టీ తరఫున నాలుగో వార్డులో పోటీ చేసిన కొవ్వూరి భార్గవి విజయం సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేయాలని కొవ్వూరి భార్గవికి సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కొవ్వూరి భార్గవికి అభినందనలు తెలిపారు.