
జనం న్యూస్ జనవరి 5 హైదరాబాద్ విద్యానగర్ లో నిరసన
వెనెజులపై అమెరికా సాయుధ ఖండిస్తూ దురాక్రమణ ను చేయడాన్ని ఖండిస్తూ సి.పి.ఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు విద్యానగర్ చౌరస్తాలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.ఈ నిరసన అనంతరం సి.పి.ఐ (ఎంఎల్) మాస్ లైన్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం.హన్మేష్ ,రాష్ట్ర సెక్రటేరి యట్ సభ్యులు గడ్డం సదానందం, పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు స్వరూప , టీ యు సి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రవీణ్, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కే ఎస్ ప్రదీప్, పి.డి.ఎస్.యు రాష్ట్ర కార్య దర్శి అనిల్ ప్రసంగించారు.వక్తలు మాట్లాడుతూ నిన్న రాత్రి అమెరికా సామ్రాజవాదం వెనేజుల పై సాయుధ దాడి చేయడానికి ఖండిస్తున్నా మన్నారు. గత సంవత్సరం కాలంగా బెదిరిస్తూ అర్ధరాత్రి వెనెజుల పై సైనిక స్థావరాలపై , నివాస స్థావరాలపై దాడి చేసి ప్రజల్ని చంపడాన్ని దుర్మార్గ మన్నారు.దేశ అధ్యక్షుడైన నికోలాస్ మధురోను,అతని జీవిత సహచరి సిలియా ఫోరస్ ను కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికా ఇలా అనేక దేశాలపై దాడులు చేస్తూ, విధ్వంసం చేస్తూ దేశాలను స్వాధీన పరచుకుంటున్నది. ఆయా దేశాల ఖనిజాలను స్వాధీనం చేసుకుంటున్నది వెనిజులా డ్రగ్స్ సరఫరా చేస్తుందని అబద్ధాలు ఆడుతూ, కేసులు పెట్టి ,దాడులు చేస్తున్నది. వెనిజులలో ఉన్న ముడి చమురును ,సహజ వాయువు నూ, ముడి ఖనిజాలను, బంగారు నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ఈ కుట్ర పన్నిందన్నారు.గతంలో ఇరాక్,అఫ్గాన్,లిబియా ,పాలస్తీనాలా పై దాడులు చేసింద న్నారు.అమెరికా కిడ్నాప్ చేసిన మధురో ను ఆతని సహచరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రత మండలి, ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకులు వరలక్ష్మి , విజయ లక్ష్మి,పుష్ప,శ్యామల, నాగ లక్ష్మి ,ప్రజా సంఘాల నాయ కులు రవి కుమార్ ,కృష్ణ, బాబు, భాస్కర్ అంజి తదితరులు పాల్గొన్నారు…..