
జనం న్యూస్ జనవరి 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఎవరు ఎక్కడ నుండైనా కష్టం లో ఉన్నాము ఆదుకోండి అని స్వయం గా ఆపదలో ఉన్నవారే వెళ్లకపోయినా తన అనుచరుల ద్వారా విన్న తక్షణమే ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ముత్యాల వెంకటేశ్వరరావు కున్న దాతృత్వం గా పేర్కొనవచ్చు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన సీనియర్ పాత్రికేయుడు బండారుపల్లి విజయ్ కుమార్ ప్రస్తుతం ఫ్యూచర్స్ ఇండియా, పత్రిక విలేఖరిగా పనిచేస్తున్నాడు,.ఈయనకు అతి మధుమేహం కారణంగా రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్ అయ్యి నడవని స్థితిలో మంచానికి పరిమితమై తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇదే విషయమై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ అనకాపల్లి జిల్లా నాయకులు కలిసి కుమార్ పరిస్థితులను ముత్యాల వెంకటేశ్వరరావు (ఎమ్ వి ఆర్)కి వివరించడంతో ఆయన పెద్ద మనసుతో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.ఈ కారణంగా ఆయనకు యూనియన్ నాయకులు దాడి వెంకట్రావు, వై దేవుళ్ల నాయుడు . శిలపర శెట్టి మాణిక్యం,అజయ్ ప్రసాద్, పొలమురశెట్టి సత్యనారాయణ,బుద్ధ భూలోక నాయుడు, పద్మ, మహేష్ తదితరులు వెంకటేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు.//