
జనం న్యూస్5డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా.
ఆసిఫాబాద్: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ తో కలిసి కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలోని అటవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, విద్యుత్, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ను సుగుణక్క కోరారు. అలాగే జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఈ నెల 11న జరగనున్న హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ వర్ధంతి సభ ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.సుగుణక్క వెంట రాయి సెంటర్ సర్మెడి కుంరం దుందే రావు,ఆత్రం దత్తు, కుంరం గుణవంత్ రావు, డోoగ్రి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్