
ప్రభుత్వము మంజూరు చేసిన ఇండ్లను అడ్డుకుంటే ఫారెస్ట్ అధికారులపై ఎదురు తిరగడానికి సిద్ధమే
తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్
జనం న్యూస్ 5డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
కొమురం భీం ఆసిఫాబాద్ అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో కాగాజ్ నగర్ మండలంలోని ధరిగామా గ్రామం లో తరతరాలుగా జీవనం సాగిస్తూవస్తున్న కొలం అదివాసులకు కేంద్ర ప్రభుత్వము నుంచి 50 ఇండ్లను మంజూరు చెస్తే వాటిని అటవీ శాఖ అధికారులు అన్యాయంగా అడ్డుకోవడం ఏమిటని తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ అన్నారు, ధరిగామ గ్రామానికి చెందిన కొలం తెగకు చెందిన ఆదివాసులు జిల్లా ఫారెస్ట్ జిల్లా అధికారి గారిని వినతి పత్రం అందించడనికీ వస్తె ఉదయం నుంచి కలవకుండా ఉన్నారని అదివాసులు వాపోయారు… ప్రభుత్వం నుంచి వచ్చిన ఇండ్లను కూడా అడ్డుకుంటూ ఆదివాసుల పై అన్యాయానికి ధిగడం ఏ మాత్రం కూడా బాగోలేదని తరతరాలుగా ఇక్కడే బతుకుతు జీవనం సాగిస్తున్న ఆదివాసిల ఇండ్లను అడ్డుకుంటే మాత్రం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు….ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాటసమితి తుడుందేబ్బ జిల్లా నాయకులు కనక ప్రభాకర్ మరియు ధరిగామ గ్రామ ఆదివాసులు మహిళలు పాల్గొన్నారు .