జనం న్యూస్ జనవరి 10, జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవ స్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవం గా జరిగాయి.సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వారా దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించబడీనది భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు వోద్దిపర్తి సంతోష్ చార్యులు వోద్దిపర్తి చిన్న సంతోష్ చార్యులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు పాటు వైకుంఠ ఏకాదశి నిర్వహణను శ్రీ కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓగుల అజయ్ ఇంకా కొంత భక్తుల సౌకర్యాయంతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలో వేలాది భక్తులు పాల్గొన్నారు