
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 05 పెబ్బేరు సోమవారం
పెబ్బేరు మండలం వై శాఖాపురం గ్రామానికి చెందిన పగడాల భరత్ మూడు నెలల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు శ్రీ రాఘవేంద్ర విద్యాలయం పెబ్బేరులో తన తోటి చదువుకున్న 2011- 2012 పదవ తరగతి పాఠశాల బాల్య మిత్రులంతా కలిసి మృతుని కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో 1.06.500/ రూపాయలను సేకరించారు ఆ నగదును ఆదివారం ఇంటి వద్ద మృతుడు భరత్ భార్య కూతురికి అందజేశారు చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్వతమయ్యారు భవిష్యత్తులో కూడా వారి పిల్లల చదువుల విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని ఆ కుటుంబానికి ధైర్యాన్ని కల్పించారు ఆ కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులను గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో మిత్ర బృందం పాల్గొన్నారు END