
జనం న్యూస్ జనవరి 5 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన అల్వాల శ్రీనివాస్, అనే స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ 97–98 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు ముందుకు వచ్చి 30,000 ఆర్థిక సహాయం అందించారు. తమ వంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సేకరించిన రూ.30,000 రూలు నగదును మృతుని కూతురు పేరు మీదు పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి ధ్రువపత్రాలను మిత్రుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రబృందం నాగరాజ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, విశ్వనాథం,బాల్ చంద్రం, కిషన్, పండరి, మాధవ్ రెడ్డి, ఉమాకర్ రెడ్డి,స్వామి తదితరులు పాల్గొన్నారు.