
జనం న్యూస్ జనవరి 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లోని నిర్వాసితులు మరియు కెపిహెచ్బీ ఆరవ ఫేజ్ కాలనీవాసులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాదె శివ నడుంబిగించారు జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న క్వార్టర్స్ నుంచి వెలువడుతున్న డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగునీరు క్వార్టర్స్ బ్యాక్ సైడ్లోనే నిల్వ అవుతూ కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్య కారణంగా దోమలు, దుర్వాసనతో పాటు మురుగునీటి కాలుష్యం వ్యాపించి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి జేఎన్టీయూ యూనివర్సిటీ ఇప్పటికే గతంలో జీహెచ్ఎంసీకి రూ.యబై లక్షలు చెల్లించినప్పటికీ,గత ప్రభుత్వ కాలం నుంచి సమస్య యథాతథంగా కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.కాలనీవాసుల ఇబ్బందులను గమనించిన గాదె శివ స్వయంగా సమస్యను పరిశీలించి, సంబంధిత మున్సిపల్ అధికారులతో పాటు జేఎన్టీయూ ఇంజనీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని,శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.అలాగే ఈ సమస్యను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ దృష్టికి తీసుకెళ్తామని గాదె శివ తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో బండి రమేష్ చర్చలు జరుపుతారని, అవసరమైతే కాలనీవాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ప్రజా ఆరోగ్య విషయంలో చైతన్య పరుస్తామని వెల్లడించారు కాలనీవాసులు తమ సమస్యకు స్పందించిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్వరితగతిన శాశ్వత పరిష్కారం రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.