
బిచ్కుంద జనవరి 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జిల్లా రవాణా అధికారి (DTO) జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక బాలికల పాఠశాల లో శనివారం రోడ్డు భద్రత మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సహాయక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు (AMVI) కె. మధుకర్, ఉదయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. (AMVI) కె మధుకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రధమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, గుడ్ సమారిటన్కు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను విద్యార్థులకు వివరించారు. ఉదయ్ కుమార్ (AMVI )విద్యార్థుల చే రహదారి భద్రతా ప్రతిజ్ఞా చేయించారు.
ప్రిన్సిపాల్ శారద మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హితవు పలికారు. తల్లిదండ్రులు కూడా హెల్మెట్ ధరించే అలవాటు ఉండేలా చేయడం పిల్లల బాధ్యత అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు వారి తల్లి తల్లిదండ్రులు చే రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు

