
జనం న్యూస్ జనవరి 6, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలోని 13వ
వార్డు ఖాన్ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నిధులతో రూ. 8లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఇంచార్జి సర్వర్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇంచార్జి సర్వర్ మాట్లాడుతూ, పరిగి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.13వ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి, సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతానని వారు తెలిపారు.