
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని పంచాయతీ కార్యదర్శినీ తెలంగాణ స్టేట్ ట్రైబల్ లీడర్ మాలోతు లింగు నాయక్ ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధికి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌తో పాటు పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాలోతు లింగు నాయక్ మాట్లాడుతూ, ప్రజల ఆశలు–ఆకాంక్షలను ప్రతిబింబించేలా పాలక వర్గం పనిచేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ లావుడియా రమ రవీందర్ నాయకత్వంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా సమిష్టి కృషి చేయాలని. సూచించారు.అనంతంరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు…..