
జనం న్యూస్ జనవరి 6
మన శంకర్ వర ప్రసాద్ సినిమా మొదటి టికెట్ ను బిజిపి రాష్ట్ర నాయకులు మోకా వెంకట సుబ్బారావు 1,16,000 రూపాయలు కు దక్కించుకున్నారు.ఈరోజు అమలాపురం వెంకట రమణ థియేటర్ వద్ద జరిగిన వేలం పాటలో పలువురు పాల్గొన్నారు. రాష్ట్రం లో అత్యధిక ధర చెల్లించిన మోకా సుబ్బారావు ను అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు అభినందించారు. మొదటి టికెట్ చిరంజీవి కుమార్తె శ్రీజ చేతులు మీదుగా అందిస్తామని సుబ్బారావు ను హైదరాబాద్ ఆడియో ఫంక్షన్ కు రావాలని స్వామి నాయుడు కోరారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, మంత్రి ప్రగాఢ వారి సత్రం చైర్మన్ గొర్తి పవన్ ఛాంబర్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, మండేల బాబీ, చిరంజీవి ఫాన్సీ నాయకులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు, నల్లా మల్లి బాబు,జనసేన నాయకులు సుదా చిన్నా, మహాదశ నాగేశ్వర రావు, పప్పుల నానాజీ తదితరులు పాల్గొన్నారు.