
జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ తల్లికి పేగు బంధం అడ్డురాలేదో.. మరెవరైనా ఎత్తుకొచ్చి పడేశారో తెలియదు గానీ బొడ్డు పేగుతోనే ఆ పసికందు తుప్పల్లో పడి ఉంది. ఈ సంఘటన జామి మండలం ఎం. కొత్తవలస గ్రామంలో జరిగింది. తుప్పల్లో గుడ్డలు చుట్టేసి పడి ఉన్న పసికందు మృతదేహాన్ని చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.